నోటీసులపై హైకోర్టుకునేహా బోరా
ABN , Publish Date - Oct 20 , 2026 | 06:45 AM
స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట పూచీకత్తు సమర్పించాలంటూ ఢిల్లీ పోలీసులు జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ.. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్..
న్యూఢిల్లీ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట పూచీకత్తు సమర్పించాలంటూ ఢిల్లీ పోలీసులు జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ.. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ‘‘అక్టోబరు 16న మండి హౌస్ వద్ద సభకు హాజరైన నన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు విడుదల చేసే వరకు ఆర్.కె. పురం పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. ఆ తర్వాత, అక్టోబరు 19న స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట విచారణకు హాజరు కావాలని, శాంతిభద్రతలు కాపాడతాననే పూచీకత్తుతో రూ. 10 వేల వ్యక్తిగత బాండ్‌పై సంతకం చేయాలని ఆ నోటీసులో తెలిపారు. భావప్రకటన, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు’’అని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. మండి హౌస్ వద్ద శాంతియుత నిరసనకు మాత్రమే తాను పిలుపునిచ్చానని, కన్నాట్ ప్లేస్ నిరసనతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.