రీ-నీట్‌ను పారదర్శకంగా నిర్వహిస్తాం: కేంద్రం
ABN , Publish Date - Jun 11 , 2026 | 03:57 AM
ఈ నెల 21న జరగనున్న నీట్ రీ ఎగ్జామ్‌ను పూర్తి పారదర్శకంగా నిర్వహించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య, విద్యా మంత్రిత్వ..
న్యూఢిల్లీ, జూన్ 10: ఈ నెల 21న జరగనున్న నీట్ రీ ఎగ్జామ్‌ను పూర్తి పారదర్శకంగా నిర్వహించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య, విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పార్లమెంటరీ కమిటీకి హామీ ఇచ్చారు. మే 3న నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో పరీక్షను రద్దు చేసి.. తిరిగి నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నీట్ పేపర్ లీకేజీపై రెండు మంత్రిత్వ శాఖలతోపాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ), జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ)కి సమన్లు జారీ చేసింది. పరీక్షను పారదర్శకంగా నిర్వహించాలని, ఎన్‌ఎంసీ, ఎన్‌టీఏ మరింత సమన్వయంతో పనిచేయాలని కోరింది.