నీట్ పీజీ ప్రశ్నలు, జవాబుల వెల్లడిపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
ABN , Publish Date - Oct 16 , 2026 | 05:58 AM
నీట్ పీజీ-2026 పరీక్షకు సంబంధించి అడిగిన ప్రశ్నలు, జవాబుల కీ, అభ్యర్థుల సమాధానాల వెల్లడిలో పారదర్శకత లోపించిందంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందించింది.
న్యూఢిల్లీ, అక్టోబరు 15: నీట్ పీజీ-2026 పరీక్షకు సంబంధించి అడిగిన ప్రశ్నలు, జవాబుల కీ, అభ్యర్థుల సమాధానాల వెల్లడిలో పారదర్శకత లోపించిందంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రం, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎ్స), జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)లకు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ను ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఇతర పిటిషన్లతో జత చేసింది. డెమోక్రటిక్ మెడికల్ అసోసియేషన్, పలువురు అభ్యర్థులు ఈ పిటిషన్ను దాఖలు చేశారు.