నీట్-పీజీలో కటాఫ్ మార్కులను ఎందుకు భారీగా తగ్గించారు
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:05 AM
పీజీ-వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్-పీజీ-2025-26 పరీక్ష కటాఫ్ మార్కులను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడానికి కారణాలేమిటో చెప్పాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: పీజీ-వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్-పీజీ-2025-26 పరీక్ష కటాఫ్ మార్కులను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడానికి కారణాలేమిటో చెప్పాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జాతీయ వైద్యశాస్త్ర పరీక్షల మండలి (ఎన్‌బీఈఎంఎ్‌స), జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ)లకూ నోటీసులిచ్చింది. నీట్-పీజీ-2025-26 కటాఫ్ మార్కులను భారీగా తగ్గిస్తూ ఎన్‌బీఈఎంఎ్‌స తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలువురు పిటిషన్ దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా 18వేల పీజీ మెడికల్ సీట్లు ఖాళీగా ఉండటంతో మూడో విడత కౌన్సెలింగ్ కోసం రిజర్వుడ్ క్యాటగిరీ విద్యార్థులకు కటాఫ్ మార్కులు 40 శాతం నుంచి జీరోకు, - మైనస్ 40 శాతానికి, జనరల్ క్యాటగిరీ విద్యార్థులు 50 నుంచి 7 శాతానికి తగ్గిస్తూ ఎన్‌బీఈఎంఎ్‌స తీసుకున్న సంగతి తెలిసిందే.