NEET:సున్నా మార్కులొచ్చినా నీట్ పీజీ సీటు!
ABN , Publish Date - Jan 15 , 2026 | 04:53 AM
నీట్-2025 పీజీ వైద్య విద్యలో ప్రవేశాలకు అర్హత శాతాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) సవరించింది.
18 వేల సీట్లు మిగిలిపోవడంతో కటాఫ్ తగ్గింపు
న్యూఢిల్లీ, జనవరి 14: నీట్-2025 పీజీ వైద్య విద్యలో ప్రవేశాలకు అర్హత శాతాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) సవరించింది. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 40శాతం నుంచి సున్నా శాతానికి, జనరల్ కేటగిరీకి 50శాతం నుంచి 7శాతానికి తగ్గించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 18వేలకు పైగా మెడికల్ పీజీ సీట్లు ఖాళీగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రెండు రౌండ్ల కౌన్సెలింగ్ పూర్తయిన అనంతరం ఎన్‌బీఈఎంఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో శిక్షణ పొందిన వైద్య నిపుణుల సంఖ్యను భారీగా పెంచడంతో పాటు అందుబాటులో ఉన్న సీట్లను గరిష్ఠంగా ఉపయోగించుకొనే లక్ష్యంతోనే ఈ సవరణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.