విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:10 AM
నీట్ వివాదంతో మానసిక ఒత్తిడికి లోనైన విద్యార్థులు ప్రాణాలు విడుస్తున్నా కేంద్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని సీజేపీ వ్యవస్థాపకుడు ...
ప్రధాని మోదీకి అభిజిత్ దీప్కే లేఖ
న్యూఢిల్లీ, జూన్ 19: నీట్ వివాదంతో మానసిక ఒత్తిడికి లోనైన విద్యార్థులు ప్రాణాలు విడుస్తున్నా కేంద్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ మొదటి నుంచి చదివి పరీక్షలు రాసే ధైర్యం లేక ఇటీవలి కాలంలో 11మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా.. గత 48 గంటల్లోనే ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లల చదువుల కోసం జీవితకాల సంపాదనను ధారపోసి, ఇప్పుడు సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు తక్షణమే రూ. కోటి చొప్పున ఆర్థికసాయం అందించాలని కోరారు. ఈ సంక్షోభానికి కారణమైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. ఈమేరకు ఆయన ప్రధాని మోదీకి రాసిన లేఖ రాశారు. తమ డిమాండ్ల సాధన కోసం శనివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రెండోసారి భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు సీజేపీ ప్రకటించింది.