స్పీకర్‌తో కూటమి మహిళా నేతల భేటీ
ABN , Publish Date - Apr 18 , 2026 | 06:17 AM
కూటమి మహిళా నేతలు రెండో రోజూ పార్లమెంటు సమావేశాలను గ్యాలరీ నుంచి వీక్షించారు....
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): కూటమి మహిళా నేతలు రెండో రోజూ పార్లమెంటు సమావేశాలను గ్యాలరీ నుంచి వీక్షించారు. కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు తదితరులు శుక్రవారం లోక్‌సభ గ్యాలరీ నుంచి ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు ప్రసంగాలను వీక్షించారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మతోనూ సమావేశమయ్యారు.