Share News

రాజ్యసభలో 2/3 మెజారిటీకి చేరువలో ఎన్డీయే

ABN , Publish Date - Jun 20 , 2026 | 03:53 AM

రాజ్యసభలోని 26 స్థానాలకు గాను ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 19 సీట్లు కైవసం చేసుకుంది. దీంతో పార్లమెంట్‌ ...

రాజ్యసభలో 2/3 మెజారిటీకి చేరువలో ఎన్డీయే

న్యూఢిల్లీ, జూన్‌ 19: రాజ్యసభలోని 26 స్థానాలకు గాను ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 19 సీట్లు కైవసం చేసుకుంది. దీంతో పార్లమెంట్‌ ఎగువ సభలో 2/3 మెజారిటీ సాధించడానికి అధికార కూటమి మరింత చేరువైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమి 6, మిజోరం నుంచి జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌(జడ్పీఎం) ఒక సీటు గెలుచుకున్నాయి. తాజా ఫలితాలతో రాజ్యసభలో ఎన్డీయే బలం 150కి చేరింది. మొత్తం 245 మంది సభ్యులు ఉన్న ఈ సభలో మూడింట రెండొంతుల మెజారిటీ(163) కోసం ఈ కూటమికి ఇంకా 13 సీట్లు అవసరం. జార్ఖండ్‌లో క్రాస్‌ ఓటింగ్‌ కారణంగా ఎన్డీయే మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి పరిమళ్‌ నత్వానీ అనూహ్య విజయం సాధించారు. ఇక మిజోరంలోని ఏకైక రాజ్యసభ స్థానాన్ని జడ్పీఎం అభ్యర్థి కె. లాలత్‌లుఆంగ్‌కిమా గెలుచుకున్నారు. తద్వారా ఎగువ సభలో ఆ పార్టీకి తొలిసారి ప్రాతినిధ్యం కల్పించారు. ఈ నెల 11 నాటికే ఎనిమిది రాష్ట్రాలకు చెందిన 24 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో ఎన్డీయే నుంచి 19 మంది, ఇండియా కూటమి సభ్యులు ఐదుగురు ఉన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 03:53 AM