Share News

తొమ్మిదో తరగతికి ‘ఎమర్జెన్సీ’పై పాఠం

ABN , Publish Date - Jun 26 , 2026 | 03:50 AM

దేశంలో ఎమర్జెన్సీ కాలం గడిచిపోయిన ఐదు దశాబ్దాల తర్వాత ఎన్‌సీఈఆర్‌టీ (నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌) తొలిసారి ....

తొమ్మిదో తరగతికి ‘ఎమర్జెన్సీ’పై పాఠం

  • తొలిసారి భాగం చేసిన ఎన్‌సీఈఆర్‌టీ

న్యూఢిల్లీ, జూన్‌ 25: దేశంలో ఎమర్జెన్సీ కాలం గడిచిపోయిన ఐదు దశాబ్దాల తర్వాత ఎన్‌సీఈఆర్‌టీ (నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌) తొలిసారి ఈ అంశాన్ని తొమ్మిదో తరగతికి పాఠ్యాంశంగా పెట్టింది. ప్రజాస్వామ్యాన్ని సవాల్‌ చేసిన అతి ముఖ్య సందర్భాల్లో ఒకటిగా ఎమర్జెన్సీని అందులో అభివర్ణించింది. ‘భారతదేశం లోపలి, బయటి సమాజాల అధ్యయనం’ పేరిట ఎన్‌సీఈఆర్‌టీ కొత్తగా తొమ్మిదో తరగతి సాంఘికశాస్త్ర పాఠ్య పుస్తకం రూపొందించింది. భారత ప్రజాస్వామ్య బలం, అది ఎదుర్కొన్న సవాళ్లను పరిచయం చేస్తూ, ఎమర్జెన్సీపై ఒక అధ్యాయాన్ని అందులో పొందుపరిచారు.

Updated Date - Jun 26 , 2026 | 03:50 AM