227 కిలోల ‘జిహాదీ’ డ్రగ్ స్వాధీనం
ABN , Publish Date - May 17 , 2026 | 04:55 AM
దేశంలోనే తొలిసారి భారీగా ‘క్యాప్టగాన్’ డ్రగ్‌ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) పట్టుకుంది. జిహాదీ డ్రగ్‌గా పిలిచే శక్తివంతమైన 227 కిలోల మాదకద్రవ్యాన్ని స్వాధీనం...
భారత్‌లో తొలిసారి పట్టుబడ్డ క్యాప్టగాన్
మొత్తం మాదకద్రవ్యం విలువ 182 కోట్లు
న్యూఢిల్లీ, మే 16: దేశంలోనే తొలిసారి భారీగా ‘క్యాప్టగాన్’ డ్రగ్‌ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) పట్టుకుంది. జిహాదీ డ్రగ్‌గా పిలిచే శక్తివంతమైన 227 కిలోల మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు శనివారం ప్రకటించింది. రూ.182 కోట్ల విలువైన ఈ డ్రగ్‌ను అంతర్జాతీయ సిండికేడ్ భారత్ మీదుగా గల్ఫ్ దేశాలకు సరఫరా చేస్తున్న క్రమంలో ఆపరేషన్ ‘రేజ్‌పిల్’ పేరుతో దానిని ఎన్‌సీబీ అడ్డుకుంది. పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన ఓ నిందితుడు ఇచ్చిన సమాచారంతో ఈనెల 14న గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో సోదాలు చేసిన ఎన్‌సీబీ బృందానికి షిప్పింగ్ కంటైనర్‌లో క్యాప్టగాన్ దొరికింది. సిరియా నుంచి వచ్చిన ఆ కంటైనర్‌లో గొర్రె ఉన్ని సరఫరా చేస్తున్నారు. ఆ ఉన్నిలో 3సంచుల్లో దాచిన క్యాప్టగాన్‌ను ఎన్‌సీబీ బృందం గుర్తించి స్వాధీనం చేసుకుంది. ఈ డ్రగ్స్ తీసుకున్నవారు రోజుల తరబడి నిద్ర, అలసట లేకుండా ఉంటారు. ఉగ్రదాడులకు ముందు టెర్రరిస్టటలు ఎక్కువ గా దీన్ని వాడతారు. అందుకే దీన్ని జిహాదీ డ్రగ్ అంటారు.