పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నయారా
ABN , Publish Date - Oct 04 , 2026 | 05:20 AM
దేశంలో అతిపెద్ద ప్రైవేటు రిటైల్ చమురు కంపెనీ నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది.
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నయారా
లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3
న్యూఢిల్లీ, అక్టోబరు 3: దేశంలో అతిపెద్ద ప్రైవేటు రిటైల్ చమురు కంపెనీ నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది. లీటరు పెట్రోల్‌పై రూ.5, లీటరు డీజిల్‌పై రూ.3 చొప్పున పెంచుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ పెంపు వెంటనే అమల్లోకి వచ్చిందని పేర్కొంది. తాజా పెంపుతో ఢిల్లీలోని నయారా పెట్రోల్ బంకుల్లో లీటరు పెట్రోల్ ధర రూ.104.51కి, లీటరు డీజిల్ ధర రూ.90.62కు చేరింది. దేశంలో ఈ సంస్థ 7,108 పెట్రోల్ బంకులను నిర్వహిస్తోంది.