Share News

నాసిక్‌ ‘మత మార్పిళ్ల’లో మలేషియా కోణం!

ABN , Publish Date - Apr 16 , 2026 | 03:28 AM

మహారాష్ట్రలోని నాసిక్‌ టీసీఎ్‌సలో సంచలనం సృష్టించిన కార్పొరేట్‌ జిహాద్‌ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మత మార్పిళ్ల కుట్ర తీగను మహారాష్ట్రలో లాగితే మలేషియాలో డొంక కదిలినట్టు తెలిసింది.

నాసిక్‌ ‘మత మార్పిళ్ల’లో మలేషియా కోణం!

నాసిక్‌, ఏప్రిల్‌ 15: మహారాష్ట్రలోని నాసిక్‌ టీసీఎ్‌సలో సంచలనం సృష్టించిన కార్పొరేట్‌ జిహాద్‌ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మత మార్పిళ్ల కుట్ర తీగను మహారాష్ట్రలో లాగితే మలేషియాలో డొంక కదిలినట్టు తెలిసింది. ఈ కుట్రను ఛేదించడానికి పోలీసులు ఆ సంస్థలో రహస్య ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ‘సిట్‌’ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఈ వర్గాలను అనుసరించి.. నాసిక్‌ టీసీఎ్‌సలో పనిచేస్తున్న ఎనిమిది మంది మహిళా టెకీలు ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులను కలిసి, ఆరుగురు తోటి ఉద్యోగులపై ఫిర్యాదు చేశారు. తమను వారు లైంగిక వేధింపులకు గురి చేయడంతోపాటు మతం మారాలంటూ ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ఆ ఫిర్యాదును నిర్ధారించుకోవడం కోసం పోలీసులు నేరుగా రంగంలోకి దిగారు. నలుగురు మహిళా కానిస్టేబుళ్లు పని మనుషుల వేషంలో అక్కడ చేరారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఉద్యోగుల కదలికలపై కన్నేశారు. ఇమ్రాన్‌ అనే వ్యక్తి ఆ ఉద్యోగులతో వాట్సాప్‌ సంభాషణలు సాగించడం ఈ క్రమంలో పోలీసుల కంట పడింది. అతడు మలేషియాతో సంబంధం కలిగిన మత ప్రచారకుడు కావచ్చునని అనుమానిస్తున్నారు. విదేశాల్లో జీవితం బాగుంటుందని, మంచి ఉద్యోగ అవకాశాలు.. చక్కని వేతనాలు దొరుకుతాయంటూ వీడియో కాల్స్‌లో వారిని ఇమ్రాన్‌ తెగ ఊరించేవాడు. ఈ కేసులో పోలీసులు తాజాగా ఆరుగురిని అరెస్టు చేశారు.

Updated Date - Apr 16 , 2026 | 03:28 AM