అంతరిక్షానికి బై బై
ABN , Publish Date - Jan 22 , 2026 | 03:30 AM
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ తన 27 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. 608 రోజులపాటు అంతరిక్షంలోనే గడి..
వ్యోమగామి సునీతా విలియమ్స్ రిటైర్మెంట్
న్యూఢిల్లీ, జనవరి 21: భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ తన 27 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. 608 రోజులపాటు అంతరిక్షంలోనే గడిపి, తొమ్మిది సార్లు స్పేస్‌వాక్ చేసిన 60 ఏళ్ల సునీతా విలియమ్స్ నాసా నుంచి రిటైరైనట్టు ప్రకటించారు. గత ఏడాది డిసెంబరు 27 నుంచే ఆమె రిటైర్మెంట్ అమల్లోకి వచ్చిందని నాసా వెల్లడించింది. 1998లో నాసాలో చేరిన సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎ్‌సఎస్) మిషన్లలో కీలక పాత్ర పోషించారు. తన సుదీర్ఘ కెరీర్‌లో మూడు సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లొచ్చారు. నాసా చరిత్రలో అత్యంత విజయవంతమైన వ్యోమగాముల్లో ఒకరిగా పలు రికార్డులు నెలకొల్పారు.