యుద్ధ ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొంటున్నాం
ABN , Publish Date - Apr 01 , 2026 | 03:43 AM
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం దేశంపై పడకుండా సమర్థంగా ఎదుర్కొంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ..
కాంగ్రెస్ వాళ్లు ‘రాజకీయ రాబందులు’: ప్రధాని మోదీ
థరాద్ (గుజరాత్), మార్చి 31: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం దేశంపై పడకుండా సమర్థంగా ఎదుర్కొంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యుద్ధం కారణంగా ఇంధనం ధరలు పెరగకుండా నియంత్రిస్తున్నామని చెప్పారు. మంగళవారం గుజరాత్‌లోని వావ్ థరాద్ జిల్లా నానీ గ్రామంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. యుద్ధం కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇంధనం ధరలు పెరగడంతో పాటు ఇతర సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. దేశంలో మాత్రం పెరిగిన ధరల భారాన్నీ కేంద్రమే భరిస్తోందని తెలిపారు. గ్యాస్, చమురుకు కొరత రాకుండా చూస్తోందని పేర్కొన్నారు. అయితే గ్యాస్‌కు, ఆయిల్‌కు కొరత ఉందని తప్పుడు ప్రచారం చేసి, పెట్రోలు బంకుల వద్ద జనం క్యూలు కట్టేలా కాంగ్రెస్ రెచ్చగొడుతోందని మోదీ ఆరోపించారు. కాంగ్రె్‌సను రాజకీయ రాబందులు ఉన్న పార్టీ అని విమర్శించారు.