మయన్మార్‌లో భారీ పేలుడు.. 45 మంది మృతి
ABN , Publish Date - Jun 01 , 2026 | 05:11 AM
మయన్మార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గనుల తవ్వకం కోసం ఉపయోగించే పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన ఓ భవనంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది.
బ్యాంకాక్, మే 31: మయన్మార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గనుల తవ్వకం కోసం ఉపయోగించే పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన ఓ భవనంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులతో సహా కనీసం 45 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. చైనా సరిహద్దుకు కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నామ్‌హాకమ్ అనే ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు తీవ్రతకు ఘటనా స్థలానికి సమీపంలోని దాదాపు 100కు పైగా ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం.