Share News

గంగాస్నానానికి వెళ్తుండగా ప్రమాదం.. ఆరుగురు స్నేహితులు సజీవ దహనం

ABN , Publish Date - Nov 10 , 2026 | 03:18 AM

దీపావళి వేళ హరియాణాలోని ఆరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. హరిద్వార్‌లో గంగాస్నానానికి కారులో బయలుదేరిన ఆరుగురు స్నేహితులు రోడ్డు ప్రమాదంలో..

గంగాస్నానానికి వెళ్తుండగా ప్రమాదం.. ఆరుగురు స్నేహితులు సజీవ దహనం

  • ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఘటన

హిసార్‌/హజారీబాగ్‌, నవంబరు 9: దీపావళి వేళ హరియాణాలోని ఆరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. హరిద్వార్‌లో గంగాస్నానానికి కారులో బయలుదేరిన ఆరుగురు స్నేహితులు రోడ్డు ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా జగ్గహేరి సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. గంటకు 120కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు విద్యుత్‌ స్తంభాన్ని, డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. వెంటనే మంటలు చెలరేగడంతో అందులోని ఆరుగురూ బయటపడలేక ప్రాణాలు కోల్పోయారు. మృతులను హరియాణాలోని హాన్సీ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. కాగా, సోమవారం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతిచెందగా, మరో 55మంది గాయపడ్డారు.

Updated Date - Nov 10 , 2026 | 03:20 AM