Share News

నలుగుర్ని బలిగొన్న అగ్నిప్రమాదం వదంతి

ABN , Publish Date - Jun 15 , 2026 | 03:30 AM

రైలు బోగీలో అగ్ని ప్రమాదం సంభవించిందన్న వదంతి నలుగురి ప్రాణాలు తీసింది. ఖజురహో-ఉదయ్‌పూర్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ ఆదివారం సాయంత్రం...

నలుగుర్ని బలిగొన్న అగ్నిప్రమాదం వదంతి

మోరేనా (ఎంపీ), జూన్‌ 14: రైలు బోగీలో అగ్ని ప్రమాదం సంభవించిందన్న వదంతి నలుగురి ప్రాణాలు తీసింది. ఖజురహో-ఉదయ్‌పూర్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ ఆదివారం సాయంత్రం 4.15 గంటల సమయంలో మోరేనా జిల్లాలోని హేతంపూర్‌ స్టేషన్‌ సమీపంలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ వదంతి వ్యాపించింది. దాంతో బోగీల్లో గందరగోళం నెలకొంది. భయంతో కొందరు వెంటనే చైను లాగి రైలును ఆపారు. రైలు నుంచి దూకి పక్కనున్న పట్టాలపైకి వెళ్లగా అదే సమయంలో అటు నుంచి పాతల్‌కోట్‌ ఎక్స్‌ప్రెస్‌ వచ్చింది. ఈ విషయాన్ని గమనించని నలుగురు వ్యక్తులు ఆ ట్రాక్‌పైనే ఉండిపోవడంతో ఆ రైలు కింద పడి మరణించారు.

Updated Date - Jun 15 , 2026 | 03:30 AM