ప్రాణాంతక గడ్డి మందును నిషేధించండి
ABN , Publish Date - Mar 28 , 2026 | 04:58 AM
ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారిన గడ్డి మందుపై సంపూర్ణ నిషేధం విధించాలని ఎంపీ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
లోక్‌సభలో ఎంపీ కావ్య వినతి
న్యూఢిల్లీ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారిన గడ్డి మందుపై సంపూర్ణ నిషేధం విధించాలని ఎంపీ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆమె ఈ అంశాన్ని లేవనెత్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆత్మహత్యలకు గడ్డి మందు (పారాక్వాట్ డైక్లోరైడ్) ‘మరణాయుధం’గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ఇప్పటి వరకు విరుగుడు లేదన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)తోపాటు పలువురు వైద్య నిపుణులు, ప్రజాప్రతినిధులు దీన్ని నిషేధించాలని కోరుతున్నట్లు తెలిపారు.