Share News

సోషియాలజీలో ‘మోదీతత్వం’

ABN , Publish Date - May 03 , 2026 | 04:10 AM

గుజరాత్‌లోని ఓ యూనివర్సిటీ ప్రధాని మోదీపై సామాజిక శాస్త్ర విద్యార్థులకు ఒక పాఠం రూపొందించింది. ఆర్‌ఎ్‌సఎస్‌ చరిత్రనూ తన విద్యార్థులను బోధించాలని నిర్ణయించింది.

సోషియాలజీలో ‘మోదీతత్వం’

  • గుజరాత్‌లోని ఓ వర్సిటీలో పాఠం

వడోదరా, మే 2: గుజరాత్‌లోని ఓ యూనివర్సిటీ ప్రధాని మోదీపై సామాజిక శాస్త్ర విద్యార్థులకు ఒక పాఠం రూపొందించింది. ఆర్‌ఎ్‌సఎస్‌ చరిత్రనూ తన విద్యార్థులను బోధించాలని నిర్ణయించింది. ‘దేశభక్తిలోని సామాజికత’ అనే శీర్షికన కొత్తగా ఈ పాఠాలను వడోదరాలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం అందించనుంది. రెండేళ్ల మాస్టర్స్‌ సోషియాలజీ ప్రోగ్రామ్‌లో వీటిని భాగం చేసి బోధించనున్నారు. మోదీపై పెట్టిన పాఠానికి ‘మోదీ తత్వం’ అని పేరుపెట్టారు. అలాగే, ఛత్రపతి శివాజీ, సాయాజీ గైక్వాడ్‌-3 కృషి, రచనలను కూడా విద్యార్థులకు పరిచయం చేయనున్నారు. దీనిపై ఆ వర్సిటీ సోషియాలజీ విభాగం అధిపతి వీరేంద్ర సింగ్‌ స్పందిస్తూ.. ‘‘ఇది మన ఇష్టాయిష్టాలకు సంబంధించిన అంశం కాదు. రాజకీయాలు, నాయకత్వాన్ని గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు మోదీపై చర్చ తప్పనిసరి. ఆయన ఈ క్షేత్రంలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న నేత. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త మాక్స్‌ వెబర్‌ తెలిపిన ప్రజాకర్షక నాయకత్వ లక్షణాలను మనం మహాత్మాగాంధీ, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌లో చూశాం. అలాంటి నాయకుడే మోదీ. శాస్త్రీయమైన అంశంగా దీనిని పరిగణించి పరిశోధనలు జరపాల్సి ఉంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక నేత ఇంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగడం విశేషమని తెలిపారు.

Updated Date - May 03 , 2026 | 04:10 AM