అసోంలో భూకబ్జాలకు కాంగ్రెస్ అండ: మోదీ
ABN , Publish Date - Mar 31 , 2026 | 04:49 AM
అసోంలో చొరబాట్ల వ్యవహారం ఎన్నికల అంశం మాత్రమే కాదని.. ఇది రాష్ట్ర గుర్తింపు, జాతీయ భద్రతకు సంబంధించిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ, మార్చి 30: అసోంలో చొరబాట్ల వ్యవహారం ఎన్నికల అంశం మాత్రమే కాదని.. ఇది రాష్ట్ర గుర్తింపు, జాతీయ భద్రతకు సంబంధించిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఏలుబడిలో అసోంలో భూములను చొరబాటుదారులు ఆక్రమించుకున్నారని.. ఆ పార్టీ ఇందుకు అనుమతించిందని ఆరోపించారు. చొరబాటుదారులు స్థానికుల చిరు వ్యాపారాలను లాక్కుని వారి పొట్టగొట్టారని ధ్వజమెత్తారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతోందన్నారు. ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయన అసోం పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలనుద్దేశించి ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రసంగించారు. చిన్న పొరపాటు చేసినా.. రాష్ట్రం మళ్లీ వెనక్కి పోతుందన్నారు.