Share News

ప్రధాని మోదీతో దక్షిణ కొరియా అధ్యక్షుడి భేటీ

ABN , Publish Date - Apr 21 , 2026 | 03:10 AM

దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్‌ సోమవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌ వేదికగా జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై మోదీ...

ప్రధాని మోదీతో దక్షిణ కొరియా అధ్యక్షుడి భేటీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20: దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్‌ సోమవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌ వేదికగా జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై మోదీ, మ్యూంగ్‌ చర్చించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు 15 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 కల్లా రెట్టింపు చేసేందుకు నిర్ణయించాయి. పారిశ్రామిక సహకారం, ఆర్థిక సంబంధాల బలోపేతానికి భారత్‌లో కొరియా పారిశ్రామిక టౌన్‌షిప్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. రక్షణ, కీలక ఖనిజాలు, ఓడల నిర్మాణం, సముద్ర రవాణా, చిప్స్‌, సెమీ కండక్టర్ల రంగంలో సహకారం పెంపొందించుకోవాలని కూడా నిర్ణయించాయి. భారత్‌, దక్షిణ కొరియా మధ్య ప్రస్తుతం ఏటా రూ.25,136 కోట్ల వాణిజ్యం జరుగుతోంది.

Updated Date - Apr 21 , 2026 | 03:10 AM