Share News

విజయ్‌ తెరపై హీరో...నిజ జీవితంలో విలన్‌: స్టాలిన్‌

ABN , Publish Date - Nov 17 , 2026 | 03:20 AM

తమిళనాడు సీఎం విజయ్‌ వెండి తెరపై హీరో అయినా, నిజ జీవితంలో మాత్రం ప్రజలకు విలన్‌గా మారారని డీఎంకే అధ్యక్షుడు, మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ ధ్వజమెత్తారు.

విజయ్‌ తెరపై హీరో...నిజ జీవితంలో విలన్‌: స్టాలిన్‌

చెన్నై, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు సీఎం విజయ్‌ వెండి తెరపై హీరో అయినా, నిజ జీవితంలో మాత్రం ప్రజలకు విలన్‌గా మారారని డీఎంకే అధ్యక్షుడు, మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ ధ్వజమెత్తారు. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలతో విరక్తి చెందిన ప్రజలు.. టీవీకే ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు సిద్ధమయ్యారన్నారు. త్వరలోనే మంచి పరిణామం సంభవించనుందని, డీఎంకే పాలన ఉదయించనుందని ప్రకటించారు. ఆరు నెలలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న విజయ్‌ ప్రభుత్వం పేరుకు మాత్రమేనని, దానిని రీల్స్‌ ప్రభుత్వం అని పిలవడం మేలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా లైంగిక దురాగతాలు, హింసలు కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించారు. ఈ లైంగిక దురాగతాల్లో అధికంగా అధికార పార్టీకి చెందిన నేతలే ఉండడం గర్హనీయమన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ పేరు ‘టీవీకే’కు బదులు ‘లైంగిక దోపిడీ ముఠా’గా పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు.

Updated Date - Nov 17 , 2026 | 03:21 AM