విమానయాన రంగ బలోపేతానికి సహకరించండి
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:15 AM
దేశీయ పౌర విమానయాన రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా దావోస్ పర్యటనలో ఉన్న కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రపంచ ప్రసిద్ధ విమాన తయారీ...
ఎయిర్‌బస్, బోయింగ్ ప్రతినిధులతో రామ్మోహన్‌నాయుడు
న్యూఢిల్లీ, జనవరి 23(ఆంధ్రజ్యోతి): దేశీయ పౌర విమానయాన రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా దావోస్ పర్యటనలో ఉన్న కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రపంచ ప్రసిద్ధ విమాన తయారీ సంస్థలు ఎయిర్‌బస్, బోయింగ్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దేశీయ విమానయాన రంగ బలోపేతానికి సహకరించాలని కోరారు. మేకిన్ ఇండియాలో భాగంగా కేవలం విమానాలను కొనడమే కాకుండా, వాటి విడిభాగాలను భారతదేశంలోనే తయారు చేసేలా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. పర్యాటక రంగం, అత్యవసర వైద్య సేవల కోసం హెలికాప్టర్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు సహకారం కోరారు.