Share News

‘మినాబ్‌ 168’..చిన్నారులకు అరుదైన నివాళి

ABN , Publish Date - Apr 12 , 2026 | 03:28 AM

విమానంలో ఒక్కో సీటులో ఓ చిన్నారి చిత్రం.. వారి రక్తంతో తడిసిన స్కూల్‌ బ్యాగు, బూట్లు.. నివాళిగా పుష్పాలు.. ఇస్లామాబాద్‌లో చర్చల కోసం వచ్చిన ఇరాన్‌ విమానంలోనిదీ దృశ్యం.

‘మినాబ్‌ 168’..చిన్నారులకు అరుదైన నివాళి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 11: విమానంలో ఒక్కో సీటులో ఓ చిన్నారి చిత్రం.. వారి రక్తంతో తడిసిన స్కూల్‌ బ్యాగు, బూట్లు.. నివాళిగా పుష్పాలు.. ఇస్లామాబాద్‌లో చర్చల కోసం వచ్చిన ఇరాన్‌ విమానంలోనిదీ దృశ్యం. యుద్ధం మొదలైన తొలిరోజున అమెరికా తొమహాక్‌ క్షిపణుల దాడిలో ధ్వంసమైన మినాబ్‌ పాఠశాలలో మరణించిన చిన్నారులకు నివాళిగా, ఆ దారుణ ఘటనను ప్రపంచం దృష్టి తీసుకురావడం కోసం ఇరాన్‌ ఈ విమానానికి ‘మినాబ్‌ 168’ అని పేరు పెట్టింది. ఈ చిత్రాన్ని ఇరాన్‌ పార్లమెంటు స్పీకర్‌ మొహమ్మద్‌ బఘర్‌ గలీబఫ్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘చర్చల కోసం మాతో కలిసి వచ్చినవారు వీరే’’ అని పేర్కొన్నారు. మినాబ్‌ పాఠశాలపై దాడిలో 160 మందికిపైగా చిన్నారులు, పలువురు టీచర్లు మరణించిన విషయం తెలిసిందే. అమెరికా తొమహాక్‌ క్షిపణి దాడులతోనే ఆ దుర్ఘటన జరిగినట్టు తర్వాత ఆధారాలు లభించాయు.

Updated Date - Apr 12 , 2026 | 03:28 AM