Microsoft: ఏఐపై మైక్రోసాఫ్ట్ దృష్టి
ABN , Publish Date - Jan 17 , 2026 | 05:01 AM
ప్రముఖ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ గత కొన్ని నెలలుగా కృత్రిమ మేధస్సు (ఏఐ)పై దృష్టి సారిస్తోంది.
న్యూఢిల్లీ, జనవరి 16: ప్రముఖ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ గత కొన్ని నెలలుగా కృత్రిమ మేధస్సు (ఏఐ)పై దృష్టి సారిస్తోంది. దీనిలో భాగంగా గతేడాది 15వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. తాజాగా ఈ కంపెనీ తన సిబ్బందికి లైబ్రరీ, వార్తాపత్రికలను అందుబాటులో ఉంచడాన్ని కూడా తగ్గిస్తోంది. అమెరికన్ టెక్నాలజీ వెబ్‌సైట్ ‘ది వెర్జ్’ కథనం మేరకు.. గత ఒప్పందాల గడువు ముగిశాక వాటి చందాలను పునరుద్ధరించబోమంటూ పలువురు పబ్లిషర్లకు ఈమెయిల్ పంపింది. ఈ క్రమంలో కంపెనీలోని దాదాపు 2,20,000 మంది ఉద్యోగులకు రెండు దశాబ్దాలకు పైగా గ్లోబల్ నివేదికలు అందించిన పబ్లిషర్ స్ట్రాటజిక్ న్యూస్ సర్వీస్ (ఎస్‌ఎన్‌ఎ్‌స)తోనూ బంధాన్ని తెంచుకుంది.