మెడికల్ షాపుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి!
ABN , Publish Date - Sep 18 , 2026 | 04:09 AM
దేశంలోని అన్ని మెడికల్ షాపుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రిస్ర్కిప్షన్ తప్పనిసరైన.. షెడ్యూల్ హెచ్, హెచ్ 1, ఎక్స్ విభాగాల మందుల విక్రయాలను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఈ ప్రతిపాదన చేసింది.
షెడ్యూల్ హెచ్, హెచ్1,
ఎక్స్ మందుల విక్రయాలపై నిఘా కోసం
కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రతిపాదన
న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: దేశంలోని అన్ని మెడికల్ షాపుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రిస్ర్కిప్షన్ తప్పనిసరైన.. షెడ్యూల్ హెచ్, హెచ్ 1, ఎక్స్ విభాగాల మందుల విక్రయాలను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఈ ప్రతిపాదన చేసింది. ఇందుకు సంబంధించి 1945 డ్రగ్స్ రూల్స్‌లో సవరణకు ప్రతిపాదించింది. రక్తపోటు, మధుమేహానికి వినియోగించే కొన్ని రకాల మందులు, కొన్ని రకాల యాంటిబయాటిక్స్, స్టెరాయిడ్లు, మానసిక సమస్యలకు వాడే కొన్ని రకాల మందులు ఈ హెచ్, హెచ్1, ఎక్స్ విభాగాల్లోకి వస్తాయి. వైద్యుడు రాసిన చెల్లుబాటయ్యే ప్రిస్ర్కిప్షన్ లేకుండా ఈ మందులను దుకాణదారులు విక్రయించరాదు. దీంతో ఈ మందుల విక్రయాలపై నిఘా పెట్టేందుకు మెడికల్ షాపుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇందుకోసం నిబంధనల్లో సవరణలను ప్రతిపాదిస్తూ ఈ నెల 8న నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం.. ఈ నిర్ణయంపై సంబంధిత వర్గాలతోపాటు ప్రజల నుంచి అభిప్రాయాలు కోరింది.