Share News

నేడు దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపులు బంద్‌

ABN , Publish Date - May 20 , 2026 | 02:53 AM

దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపులు బుధవారం మూతపడనున్నాయి. ఆన్‌లైన్‌లో మందులు విక్రయించే ఈ-ఫార్మసీ సంస్థలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆలిండియా ...

నేడు దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపులు బంద్‌

న్యూఢిల్లీ, మే 19: దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపులు బుధవారం మూతపడనున్నాయి. ఆన్‌లైన్‌లో మందులు విక్రయించే ఈ-ఫార్మసీ సంస్థలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆలిండియా ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కెమిస్ట్స్‌, డ్రగ్గిస్ట్స్‌ (ఏఐఓసీడీ) పిలుపు మేరకు రిటైల్‌ షాపులు బంద్‌ పాటించనున్నాయి. అయితే అన్ని ప్రధాన ఫార్మసీ చైన్‌ షాపులు, ఆస్పత్రుల్లో ఉండే మెడికల్‌ స్టోర్లు, జన ఔషధి కేంద్రాలు, అమృత్‌ ఫార్మసీ ఔట్‌లెట్స్‌ మాత్రం తెరిచే ఉంటాయి. ఇటీవల ఏఐఓసీడీ ప్రతినిధులు కేంద్ర డ్రగ్‌ నియంత్రణ సంస్థతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఈ-ఫార్మసీల నియంత్రణ, నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో చట్టపరమైన అన్ని అంశాలను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటామని డ్రగ్‌ నియంత్రణ సంస్థ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏఐఓసీడీ ఒక రోజు బంద్‌ పాటించాలని నిర్ణయించింది. అయితే తాము ఈ బంద్‌లో పాల్గొనబోమని పశ్చిమ బెంగాల్‌, కేరళ, పంజాబ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, హరియాణ, ఉత్తరప్రదేశ్‌, లదాఖ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, సిక్కిం, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల అసోసియేషన్లు లేఖలు సమర్పించాయి.

Updated Date - May 20 , 2026 | 02:53 AM