మోదీకి మేం పెద్ద అభిమానులం: రుబియో
ABN , Publish Date - Jun 28 , 2026 | 04:22 AM
భారత ప్రధాని మోదీకి మేం పెద్ద అభిమానులం’’ అని అమెరికా విదేశాంగ మంత్రి రుబియో అన్నారు. మోదీ సమర్థ నాయకత్వంలో భారతదేశం..
న్యూఢిల్లీ, జూన్ 27: ‘‘భారత ప్రధాని మోదీకి మేం పెద్ద అభిమానులం’’ అని అమెరికా విదేశాంగ మంత్రి రుబియో అన్నారు. మోదీ సమర్థ నాయకత్వంలో భారతదేశం అద్భుతమైన ఆర్థిక పురోగతిని సాధిస్తోందన్నారు. శనివారం రుబియో భారతీయ వార్తాసంస్థ ఐఏఎన్‌ఎస్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చే ఏడాది భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉందని ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అధ్యక్షుడి పర్యటన ఏర్పాట్ల కోసం తాను ఈ ఏడాది చివర్లో భారత్‌లో పర్యటిస్తానని చెప్పారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం చర్చలు తుదిదశకు చేరుకున్నాయని రుబియో ఈ సందర్భంగా తెలిపారు.