2 మావోయిస్టు డంప్‌ల గుర్తింపు
ABN , Publish Date - Feb 15 , 2026 | 07:13 AM
ఛత్తీస్‌గఢ్‌లోని అడవుల్లో రెండు వేర్వేరు చోట్ల మావోయిస్టు పార్టీ డంప్‌లను శనివారం కేంద్ర భద్రతా బలగాలు గుర్తించాయి.
సుకుమా జిల్లాలో మావోయిస్టు స్మారక స్తూపం కూల్చివేత
చర్ల, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి):ఛత్తీస్‌గఢ్‌లోని అడవుల్లో రెండు వేర్వేరు చోట్ల మావోయిస్టు పార్టీ డంప్‌లను శనివారం కేంద్ర భద్రతా బలగాలు గుర్తించాయి. మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు కేంద్ర భద్రతా బలగాల కూంబింగ్‌లో కాంకేర్- నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లోని బీనగూడ-చొటేబేతియా, కర్రె గుట్టల్లో ఈ డంప్‌లు దొరికాయి. ఈ డంప్‌ల్లో మావోయిస్టు పార్టీ వస్తువులు, తుపాకులు, బీజీఎల్స్ లాంచర్లు, ఐఈడీ సహా ఇతర పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. సుకుమా జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి చెందిన భారీ స్మారక స్థూపాన్ని శనివారం కేంద్ర బలగాలు కూల్చేశాయి.