మణిపూర్‌లో మళ్లీ హింస.. ఐదుగురి మృతి
ABN , Publish Date - Oct 11 , 2026 | 06:08 AM
మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. కామ్జోంగ్, ఉఖ్రుల్ జిల్లాల్లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కుకీలకు చెందిన మహిళ సహా ముగ్గురు, నాగాలకు చెందిన ఇద్దరు ఉన్నారు.
ఇంఫాల్, అక్టోబరు 10: మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. కామ్జోంగ్, ఉఖ్రుల్ జిల్లాల్లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కుకీలకు చెందిన మహిళ సహా ముగ్గురు, నాగాలకు చెందిన ఇద్దరు ఉన్నారు. అధికారుల వివరాల ప్రకారం.. కామ్జోంగ్ జిల్లాలోని చస్సాద్ గ్రామంలో శనివారం ఉదయం అనుమానిత సాయుధులు జరిపిన కాల్పుల్లో 23ఏళ్ల మైఖేల్ హాకిప్ మరణించారు. అంతకుముందు శుక్రవారం రాత్రి కుకీ మహిళ డోమ్‌ఖోకెయ్ టౌథాంగ్ (42) బుల్లెట్ గాయాలతో మృతి చెందారు. ఆమెకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. కామ్జోంగ్ జిల్లాలోని మణిపూర్, మయన్మార్ సరిహద్దులోని నింగ్చౌ గ్రామంలో శనివారం జరిగిన కాల్పుల్లో నాగాలకు చెందిన న్గాచాన్సో నింగ్షెన్ (35), లీషిషాన్ లీషాడాన్ (48) హతమయ్యారు. ఉఖ్రుల్ జిల్లాలోని టీఎం కసోం సమీపంలో యావోలిన్ వద్ద జరిగిన దాడిలో సందీ్‌పరాయ్ (40) ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై సాయుధులు కాల్పులు జరిపినట్లు సమాచారం. మరోవైపు చస్సాద్‌లో పది ఇళ్లు, ఇరవై దుకాణాలకు నిప్పు పెట్టారు.