Share News

మణిపూర్‌లో మిలిటెంట్ల కాల్పుల్లో ముగ్గురి మృతి

ABN , Publish Date - Oct 20 , 2026 | 06:42 AM

మణిపూర్‌లో మిలిటెంట్లు సోమవారం ముగ్గురిని కాల్చి చంపారు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇద్దరి మృతదేహాలను ఇంపాల్‌లోని మణిపూర్‌ సీఎం కేమ్‌చంద్‌ సింగ్‌ ఇంటి వద్దకు తెచ్చి నిరసన తెలిపారు.

మణిపూర్‌లో మిలిటెంట్ల కాల్పుల్లో ముగ్గురి మృతి

  • ఇద్దరి మృతదేహాలతో సీఎం ఇంటి వద్ద నిరసన

ఇంపాల్‌, అక్టోబరు 19: మణిపూర్‌లో మిలిటెంట్లు సోమవారం ముగ్గురిని కాల్చి చంపారు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇద్దరి మృతదేహాలను ఇంపాల్‌లోని మణిపూర్‌ సీఎం కేమ్‌చంద్‌ సింగ్‌ ఇంటి వద్దకు తెచ్చి నిరసన తెలిపారు. తూర్పు ఇంపాల్‌, కాంగ్‌పోక్పి జిల్లాల సరిహద్దులోని అడవిలో కట్టెలు తెచ్చుకొనేందుకు వెళ్లిన 16 మంది మైతి తెగ వారిపై మిలిటెంట్లు కాల్పులు జరిపారు. దీంతో ముగ్గురు చనిపోగా.. ముగ్గురు గాయపడ్డారు. మరో ముగ్గురు కనిపించకుండా పోయారని అధికారులు చెప్పారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా మణిపూర్‌ సీఎంనివాసం ముందు బాధితులు మృతదేహాలతో నిరసన తెలిపిన సమయంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు బాష్ప వాయు గోళాలను ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు. అనంతరం మృతదేహాలను జవహర్‌ లాల్‌ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కి తరలించారు. మణిపూర్‌ సీఎం కేమ్‌చంద్‌ సింగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి రాష్ట్రంలో భద్రతా పరిస్థితులపై సమీక్షించారు. మిలిటెంట్లు అమాయక పౌరులను హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మరోవైపు మణిపూర్‌ కామ్‌జోంగ్‌ జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో మిలిటెంట్లు నాగా, కుకి తెగలకు చెందిన వారి 28 ఇళ్లకు నిప్పు పెట్టారు. దీంతో బాధితులు సైనిక క్యాంపులో తల దాచుకున్నారు.

Updated Date - Oct 20 , 2026 | 06:43 AM