Share News

మాణిక్కం ఠాగూర్‌కు తమిళనాడు కాంగ్రెస్‌ పగ్గాలు

ABN , Publish Date - Jun 28 , 2026 | 04:23 AM

తమిళనాడు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) అధ్యక్షుడిగా సీనియర్‌ నేత, ఎంపీ బీ మాణిక్కం ఠాగూర్‌ నియమితులయ్యారు. ఠాగూర్‌ నియమాకాని..

మాణిక్కం ఠాగూర్‌కు తమిళనాడు కాంగ్రెస్‌ పగ్గాలు

న్యూఢిల్లీ, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): తమిళనాడు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) అధ్యక్షుడిగా సీనియర్‌ నేత, ఎంపీ బీ మాణిక్కం ఠాగూర్‌ నియమితులయ్యారు. ఠాగూర్‌ నియమాకానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ఆమోదం తెలిపారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాలను చూస్తున్న మాణిక్కంకు దక్షిణాది రాజకీయాలపై పట్టు ఉంది. గతంలో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఆయన ఉన్న సమయంలోనే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియమితులయ్యారు.

Updated Date - Jun 28 , 2026 | 04:23 AM