Share News

రెండేళ్ల కేంద్ర డిప్యూటేషన్‌ తప్పనిసరి!

ABN , Publish Date - Feb 01 , 2026 | 04:38 AM

కేంద్రంలో ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(ఐజీ) లేదా సమాన హోదా పోస్టుల్లో ఐపీఎస్‌ అధికారుల ఎంప్యానెల్‌మెంట్‌కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది.

రెండేళ్ల కేంద్ర డిప్యూటేషన్‌ తప్పనిసరి!

  • కేంద్రంలో ఐజీ స్థాయి పోస్టులకు ఎంప్యానెల్‌మెంట్‌ మార్గదర్శకాల సవరణ.. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు

న్యూఢిల్లీ, జనవరి 31: కేంద్రంలో ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(ఐజీ) లేదా సమాన హోదా పోస్టుల్లో ఐపీఎస్‌ అధికారుల ఎంప్యానెల్‌మెంట్‌కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. 2011, ఆ తర్వాత బ్యాచ్‌ల అధికారులకు కొత్త అర్హతా నిబంధనలు ప్రవేశపెట్టింది. కేంద్రంలో ఐజీ స్థాయి పోస్టులకు ఎంప్యానెల్‌మెంట్‌ (ఎంపిక) సాధించాలంటే కనీసంగా రెండేళ్లు సెంట్రల్‌ డిప్యూటేషన్‌పై ఎస్పీ/డీఐజీ లేదా సమాన హోదా స్థాయిల్లో తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుందని కేంద్ర హోం శాఖ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతకుముందు ఎంప్యానెల్‌మెంట్‌ గైడ్‌లైన్స్‌లో ఇలా ‘తప్పనిసరి కేంద్ర అనుభవం’ అనే రూల్‌ ఉండేది కాదు. సవరించిన నిబంధన ప్రస్తుతం తమ క్యాడర్‌లో డీఐజీ లేదా సమాన స్థాయిల్లో పనిచేస్తూ, రానున్న సంవత్సరాల్లో ఐజీగా పరిగణనలోకి తీసుకొనే 2011, ఆ తర్వాత బ్యాచ్‌ల ఐపీఎస్‌ అధికారులకు వరిస్తుంది. ప్రస్తుతం ఐపీఎస్‌ అధికారులు ఈ స్థాయిల్లో చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి.

Updated Date - Feb 01 , 2026 | 04:39 AM