Share News

ఐఐఎం కోల్‌కతా బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ చైర్మన్‌గా మామిడాల జగదీశ్‌ కుమార్‌

ABN , Publish Date - Mar 07 , 2026 | 04:33 AM

తెలంగాణకు చెందిన ప్రముఖ విద్యావేత్త, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) మాజీ చైర్మన్‌ మామిడాల జగదీశ్‌ కుమార్‌ ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌....

ఐఐఎం కోల్‌కతా బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ చైర్మన్‌గా మామిడాల జగదీశ్‌ కుమార్‌

న్యూఢిల్లీ/తిప్పర్తి, మార్చి 6: తెలంగాణకు చెందిన ప్రముఖ విద్యావేత్త, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) మాజీ చైర్మన్‌ మామిడాల జగదీశ్‌ కుమార్‌ ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎమ్‌), కోల్‌కతా గవర్నర్ల బోర్డు చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన నియామకానికి శుక్రవారం ఆమోదం తెలిపారు. ఆయన ఈ పదవిలో నాలుగేళ్ల పాటు లేదా 70 ఏళ్ల వయసు (ఏది ముందైతే అది) వచ్చే వరకు కొనసాగనున్నారు. జగదీశ్‌ కుమార్‌ 2022- 2025 వరకు యూజీసీ చైర్మన్‌గా పనిచేసి ఎన్నో సంస్కరణలు తెచ్చారు. అంతకు ముందు 2016- 2022 వరకు ఢిల్లీలోని జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) వైస్‌ చాన్సలర్‌గా పని చేశారు. విద్యా రంగంలో ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఐఐఎంలలో బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ (బీఓజీ) అనేది అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. ఇందులో విద్యావేత్తలు, పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. కాగా, ఈ ప్రకటనతో జగదీశ్‌ కుమార్‌ స్వగ్రామం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలలో సంబరాలు మొదలయ్యాయి.

Updated Date - Mar 07 , 2026 | 04:33 AM