Share News

మమత కారుపై చెప్పులతో దాడి

ABN , Publish Date - Aug 10 , 2026 | 04:46 AM

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు, రాళ్లు, వాటర్‌ బాటిళ్లు విసిరారు. బురద చల్లారు.

మమత కారుపై చెప్పులతో దాడి

  • రాళ్లు, వాటర్‌ బాటిళ్లు కూడా

  • విసిరిన గుర్తు తెలియని వ్యక్తులు

  • బందిపోటు రాణి అంటూ నినాదాలు

  • ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఘటన

కోల్‌కతా, ఆగస్టు 9: తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు, రాళ్లు, వాటర్‌ బాటిళ్లు విసిరారు. బురద చల్లారు. దీదీ కారును చుట్టుముట్టి బందిపోటు రాణి అంటూ నినాదాలు చేశారు. ఘటన ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగింది. ఇటీవల పోలీస్‌ కస్టడీలో మృతిచెందిన బిర్జు అనే టీఎంసీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా మమతపై ఈ దాడి జరిగింది. కారు కిటికీ అద్దాలు మూసి ఉండకపోతే తన తల పగిలిపోయి ఉండేదని దీదీ చెప్పారు. తాను వస్తున్నట్లు పోలీసులకు చెప్పినా సువేందు అధికారి ప్రభుత్వం రక్షణ కల్పించలేదని ఆమె ఆరోపించారు. మరోవైపు దాడి ఘటనను బీజేపీ ఖండించింది. ఉద్రిక్తతలు రెచ్చకొట్టేందుకే మమత వెళ్లారని, స్థానికులు నిరసన తెలిపారని ఆరోపించింది. ఇలాంటి దాడులను బీజేపీ సమర్ధించదని పార్టీ రాష్ట్రఅధ్యక్షుడు సమిక్‌భట్టాచార్య స్పష్టం చేశారు.

Updated Date - Aug 10 , 2026 | 04:47 AM