Share News

కేంద్ర బలగాలు ఓటేయనీయకుంటే చీపుర్లు పట్టండి

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:01 AM

ఓటు వేయకుండా కేంద్ర బలగాలు అడ్డంకులు కలిగిస్తే గట్టిగా నిలబడాలని మహిళలకు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.

కేంద్ర బలగాలు ఓటేయనీయకుంటే చీపుర్లు పట్టండి

  • మహిళలకు టీఎంసీ అధినేత్రి మమత పిలుపు

కోల్‌కతా, ఏప్రిల్‌ 14: ఓటు వేయకుండా కేంద్ర బలగాలు అడ్డంకులు కలిగిస్తే గట్టిగా నిలబడాలని మహిళలకు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. మంగళవారం పూర్బ, పశ్చిమ మేదీనీపూర్‌ జిల్లాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. శాంతి భద్రతల రక్షణ కేంద్రబలగాల విధి అని, కానీ అవి ప్రజలను ఓటేయకుండా అడ్డుకుంటే ఏమి చేయాలని ప్రశ్నించారు. బూట్లు వేసుకొని ఆయుధాలు పట్టుకున్న జవాన్లకు వ్యతిరేకంగా చీపుర్లు పట్టుకొని గట్టిగా నిలబడాలని మహిళలను కోరారు. తానేమీ హింసను ప్రోత్సహించడం లేదని, ఓటు హక్కును కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని మాత్రమే కోరుతున్నానని వివరణ ఇచ్చారు.

Updated Date - Apr 15 , 2026 | 04:01 AM