కమ్యూనిస్టులు, మావోయిస్టులకు తేడా తెలియదా?: మల్లు రవి
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:50 AM
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కమ్యూనిస్టు పార్టీకి, మావోయిస్టు ఉద్యమానికి మధ్య తేడా తెలియదా? అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మండిపడ్డారు...
న్యూఢిల్లీ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కమ్యూనిస్టు పార్టీకి, మావోయిస్టు ఉద్యమానికి మధ్య తేడా తెలియదా? అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. సీపీఐ, సీపీఎంలతో కలిసి పని చేసిన చరిత్ర బీజేపీకి లేదా? అని ప్రశ్నించారు.. నక్సలిజం నిర్మూలన అంశంపై చర్చలో భాగంగా కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబంపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మల్లు రవి తీవ్రంగా ఖండించారు. సీపీఐ, సీపీఎంతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న మాట వాస్తవమేనని, అవి రాజ్యాంగం గుర్తించిన పార్టీలనే విషయాన్ని అమిత్ షా గ్రహించాలన్నారు. జనతా పార్టీ ఏర్పడిన సమయంలో ఆ కూటమిలో సీపీఐ, సీపీఎంతోపాటు బీజేపీ, జన్‌సంఘ్ కూడా ఉన్నాయనే విషయాన్ని పార్లమెంట్‌లో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.