Makara Jyothi: శబరిమలలో మకర జ్యోతి దర్శనం
ABN , Publish Date - Jan 15 , 2026 | 05:02 AM
శబరిమలలో బుధవారం సాయంత్రం మకర జ్యోతి దర్శనమిచ్చింది. మకర జ్యోతిని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలిరాగా..
శబరిమల(కేరళ), జనవరి 14: శబరిమలలో బుధవారం సాయంత్రం మకర జ్యోతి దర్శనమిచ్చింది. మకర జ్యోతిని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలిరాగా.. అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మార్మోగాయి. అయ్యప్ప స్వామి సంక్రాంతి పండుగ రోజున శబరిమలలోని పంచగిరులపై మకర జ్యోతి రూపంలో దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం. అయితే, ఈసారి బుధవారం మధ్యాహ్నం 3.13 గంటల నుంచి మకర సంక్రాంతి కాలం ప్రారంభమైంది.