ఆస్ట్రేలియాలో గాంధీ కాంస్య విగ్రహాన్ని కట్టర్లతో కోసి ఎత్తుకెళ్లిన దుండగులు
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:17 AM
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో ఉన్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. నగరం శివారు ప్రాంతమైన రోవిల్‌లోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్‌లో...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో ఉన్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. నగరం శివారు ప్రాంతమైన రోవిల్‌లోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్‌లో ఈ విగ్రహం ఉంది. దీని బరువు 426 కిలోలు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్) ఈ విగ్రహాన్ని ఆస్ట్రేలియాకు బహుమతిగా ఇచ్చింది. 2021, నవంబరు 12న అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ గాంధీ విగ్రహాన్ని ఈ కమ్యూనిటీ సెంటర్‌లో ఆవిష్కరించారు. సోమవారం ముగ్గురు దుండగులు కట్టర్ల సాయంతో విగ్రహాన్ని కాళ్ల వరకు కోసి ఎత్తుకెళ్లారు. దీన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.