Share News

తునికాకు కోసం వెళ్లిన మహిళలపై పులి దాడి

ABN , Publish Date - May 23 , 2026 | 03:58 AM

అడవిలో తునికాకులు ఏరుకోవడానికి వెళ్లిన నలుగురు మహిళలపై పులి దాడి చేసి చంపేసింది. ఈ భయానక ఘటన మహారాష్ట్రలోని చంద్రపుర్‌ జిల్లా గుంజేవాహి-పవన్‌ పార్‌ ...

తునికాకు కోసం వెళ్లిన మహిళలపై పులి దాడి

  • నలుగురి మృతి.. మహారాష్ట్రలో ఘటన

ముంబై, మే 22: అడవిలో తునికాకులు ఏరుకోవడానికి వెళ్లిన నలుగురు మహిళలపై పులి దాడి చేసి చంపేసింది. ఈ భయానక ఘటన మహారాష్ట్రలోని చంద్రపుర్‌ జిల్లా గుంజేవాహి-పవన్‌ పార్‌ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగింది. ప్రతి ఏటా వేసవి కాలంలో స్థానిక మహిళలు బీడీల తయారీకి ఉపయోగపడే తునికాకులను ఏరుకోవడానికి అడవికి వెళ్తుంటారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 13 మంది మహిళలు అడవిలోకి వెళ్లారు. వారు పనిలో నిమగ్నమై ఉండగా, అప్పటికే పొదల్లో పొంచి ఉన్న ఓ పులి ఒక్కసారిగా మహిళలపైకి దూకింది. పులి దాడిలో నలుగురు మహిళలు మృతిచెందారు. మిగిలిన మహిళలు భయంతో కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. మృతులలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు.

Updated Date - May 23 , 2026 | 03:58 AM