నిర్మాణంలోని ఆలయ మండపం కూలి మహారాష్ట్రలో ఆరుగురు భక్తుల మృతి
ABN , Publish Date - Jun 21 , 2026 | 04:23 AM
మహారాష్ట్రలోని పర్భణి జిల్లా యశ్వాడి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆలయ మండపం పైకప్పు కూలి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
పర్భణి, జూన్ 20: మహారాష్ట్రలోని పర్భణి జిల్లా యశ్వాడి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆలయ మండపం పైకప్పు కూలి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది గాయపడ్డారు. ఆ గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద నిర్మాణంలో ఉన్న సభామండపం పైకప్పు శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో కుప్పకూలింది. అదే సమయంలో దాని కింద ఉన్న భక్తులపై పడింది. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల వంతున సహాయం అందజేయనున్నట్టు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు.