Share News

మహారాష్ట్రలో కల్తీ మద్యం తాగి 14 మంది మృతి

ABN , Publish Date - May 30 , 2026 | 03:12 AM

మహారాష్ట్రలోని పుణె నగరం, పింప్రి చించ్‌వాడ్‌లలో కల్తీ మద్యం తాగిన 14 మంది బుధ, గురువారాల్లో మృతి చెందారు. పింప్రి చించ్‌వాడ్‌లోని ...

మహారాష్ట్రలో కల్తీ మద్యం తాగి 14 మంది మృతి

పుణె, మే 29: మహారాష్ట్రలోని పుణె నగరం, పింప్రి చించ్‌వాడ్‌లలో కల్తీ మద్యం తాగిన 14 మంది బుధ, గురువారాల్లో మృతి చెందారు. పింప్రి చించ్‌వాడ్‌లోని పుగెవాడిలో 10 మంది మృతి చెందగా... మరో ఐదుగురు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పుణె హదప్సర్‌లోని పంధేర్‌ మాలాలో మరో నలుగురు మృతి చెందారు. స్థానికులు కల్తీ మద్యం కారణంగానే వీరంతా మృతి చెందారని చెబుతుండగా.. పోలీసులు మాత్రం ఫోరెన్సిక్‌, శవ పరీక్షల నివేదికలు వచ్చాకే వారి మరణాలకు అసలు కారణం తెలుస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా పుణె జిల్లాలో పెద్ద ఎత్తున సాగుతోన్న మద్యం అక్రమ వ్యాపార నెట్‌వర్క్‌ని గుర్తించినట్లు మహారాష్ట్ర పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం 8 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసును సీఐడీకి బదిలీ చేసినట్లు వెల్లడించారు.

Updated Date - May 30 , 2026 | 03:12 AM