Share News

ఐటీ కంపెనీలో లైంగిక వేధింపులు

ABN , Publish Date - Apr 10 , 2026 | 03:19 AM

మహారాష్ట్రలో నాసిక్‌లోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో లైంగిక వేధింపుల పర్వం కలకలం రేపుతోంది. లైంగిక వేధింపులు, అత్యా చారంతో పాటు మతపరమైన దూషణల అభియోగాలపై ఆ కంపెనీకి చెందిన ఆరుగురు టీమ్‌ లీడర్లు....

ఐటీ కంపెనీలో లైంగిక వేధింపులు

  • మహారాష్ట్రలో ఆరుగురు టీమ్‌ లీడర్ల అరెస్టు

  • లైంగిక వేధింపులు, అత్యాచారం, మతపరమైన దూషణల అభియోగాలపై కేసులు నమోదు

  • మరింత లోతుగా దర్యాప్తునకు సిట్‌ ఏర్పాటు

నాసిక్‌, ఏప్రిల్‌ 9: మహారాష్ట్రలో నాసిక్‌లోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో లైంగిక వేధింపుల పర్వం కలకలం రేపుతోంది. లైంగిక వేధింపులు, అత్యా చారంతో పాటు మతపరమైన దూషణల అభియోగాలపై ఆ కంపెనీకి చెందిన ఆరుగురు టీమ్‌ లీడర్లు, ఒక హెచ్‌ఆర్‌ మహిళా ఉద్యోగిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు ‘సిట్‌’ను ఏర్పాటు చేశారు. దర్యాప్తు సాగేకొద్దీ మరింతమంది బాధితులు ముం దుకొచ్చే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు బాధితులుగా ఎనిమది మంది మహిళలతో పాటు ఓ పురుషుడు ఉండగా.. మొత్తం తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. బాధిత మహిళ లందరూ 18-25 మధ్య వయసు గలవారే! పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోష్‌)-2013 కింద బాధితులు అంతకుముందు ఫిర్యాదు చేసినప్పటికీ.. కంపెనీ హెచ్‌ఆర్‌ హెడ్‌ పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఫిర్యాదులను అణచివేశారనే ఆరోపణలపై పోలీసులు ఆ హెచ్‌ఆర్‌ ఉద్యోగిని కూడా అరెస్టు చేశారు. కాగా, అరెస్టు చేసిన పురుష నిందితులను ఆసిఫ్‌ అన్సారీ, షఫీ షేక్‌, షారుక్‌ ఖురేషీ, రజా మెమోన్‌, తౌఫిక్‌ అత్తార్‌లుగా గుర్తించారు. బాధితులపై గత 2-3 ఏళ్లుగా లైంగిక వేధింపుల ఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు. తమపై అనుచిత శారీరక వేధింపులు జరిగాయని, తమ శరీరం, దుస్తుల గురించి అభ్యంతర వ్యాఖ్యలు చేసేవారని, అదేవిధంగా తమ మతాన్ని లక్ష్యంగా చేసుకొని పదేపదే దూషించే వారని బాధితులు వారి ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 03:19 AM