హాస్టల్లో దెయ్యాలు.. ఇళ్లకు పిల్లలు!
ABN , Publish Date - Aug 15 , 2026 | 05:31 AM
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఓ ప్రభుత్వ హాస్టల్‌లో దెయ్యాలు, భూతాలు ఉన్నాయంటూ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందారు. నాకు దెయ్యం కనిపించింది అని ఒకరంటే..
నవ్వులు, వింత శబ్ధాలు వినిపిస్తున్నాయని ఫిర్యాదు
ప్రభుత్వ హాస్టల్‌ను ఖాళీ చేసిన 608 మంది పిల్లలు
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఘటన
ముంబై, ఆగస్టు 14: మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఓ ప్రభుత్వ హాస్టల్‌లో దెయ్యాలు, భూతాలు ఉన్నాయంటూ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందారు. నాకు దెయ్యం కనిపించింది అని ఒకరంటే.. ఆ దెయ్యం నవ్వులు నాకు వినిపించాయ్ అని మరొకరు చెప్పడం మొదలుపెట్టారు. ఇంకొకరేమో ఆ దెయ్యం వింత అరుపులు తనను భయపెడుతున్నాయని, వింత వింత శబ్ధాలు వినిపిస్తున్నాయని భయపడిపోయారు. ఈ ప్రచారంతో మిగతా పిల్లలు హడలిపోయారు. ఫలితంగా 263 మంది బాలురు, 345 మంది బాలికలు ‘బాబోయ్.. ఈ హాస్టల్లో మేం ఉండలేం’ అంటూ ఇళ్లకు వెళ్లిపోయారు! స్కూల్ హెడ్‌మాస్టర్ చొరవతో మానసిక వైద్యులు రంగంలోకి దిగారు. పిల్లల్లో భయం, మానసిక ఒత్తిడి ఫలితంగా వచ్చే మాస్ హిస్టీరియా కారణంగానే వారిలో దెయ్యాల భయం నెలకొందని వివరించారు.