బావిలో వ్యాన్ బోల్తా ..14 మంది భక్తుల మృతి
ABN , Publish Date - Jun 15 , 2026 | 03:29 AM
మహారాష్ట్రలో రోడ్డు పక్కనున్న వ్యవసాయ బావిలో పిక్‌పవ్యాన్ బోల్తా పడడంతో కనీసం 14మంది భక్తులు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు...
పండరిపూర్ సమీపంలో దుర్ఘటన
పండరిపూర్, జూన్ 14: మహారాష్ట్రలో రోడ్డు పక్కనున్న వ్యవసాయ బావిలో పిక్‌పవ్యాన్ బోల్తా పడడంతో కనీసం 14మంది భక్తులు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నారు. పుణ్యక్షేత్రమైన పండరిపూర్ సమీపంలోని తందుల్వాడీ గ్రామం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్‌కు స్టీరింగ్‌పై అదుపు తప్పడంతో ఆ వ్యాన్ రోడ్డును దాటి పక్కనున్న బావిలో బోల్తా పడింది. భూమికి సమాంతరంగా ఉన్న ఆ బావికి పిట్టగోడ కూడా లేకపోవడంతో ఆ వ్యాన్ మెత్తంగా దాంట్లో పడిపోయింది. రంజని గ్రామానికి చెందిన 15 మంది మహాస్వాద్‌లోని సిద్ధనాథ్ దేవాలయంలో పూజలు చేసుకొని తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున సీఎం ఫడణవీస్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.