భారత్‌కు ‘మహాదేవ్’ స్కాం నిందితుడు సౌరభ్
ABN , Publish Date - Nov 02 , 2026 | 02:01 AM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహాదేవ్ యాప్ బెట్టింగ్ స్కాం కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌరభ్ చంద్రాకర్‌ను ఒమన్ నుంచి సీబీఐ భారత్‌కు..
న్యూఢిల్లీ, నవంబరు 1: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహాదేవ్ యాప్ బెట్టింగ్ స్కాం కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌరభ్ చంద్రాకర్‌ను ఒమన్ నుంచి సీబీఐ భారత్‌కు తీసుకొచ్చింది. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా ఒమన్ పోలీసులు ఈ ఏడాది జూన్‌లో సౌరభ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఒమన్ రాజధాని మస్కట్‌కు వెళ్లిన సీబీఐ అధికారుల బృందం.. అక్కడ సౌరభ్‌ను అదుపులోకి తీసుకుని భారత్‌కు తీసుకొచ్చింది. సోమవారం అతడిని రాయ్‌పూర్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు పర్చనున్నారు. మహాదేవ్ యాప్‌తో పాటు అనుబంధ బెట్టింగ్ వెబ్‌సైట్ల ద్వారా సాగిన ఈ కుంభకోణం మొత్తం విలువ దాదాపు రూ.94,400 కోట్ల వరకు ఉండొచ్చని ఈడీ అంచనా వేసింది.