Share News

‘మదురై తనిష్క్‌’ దోపిడీలో ప్రధాన నిందితుడు అరెస్టు

ABN , Publish Date - Nov 17 , 2026 | 03:22 AM

మదురై తనిష్క్‌ జువెలరీషాపులో ఐదు రోజుల క్రితం జరిగిన బంగారు నగల దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు నిషాంత్‌ కృష్ణ (25)ను..

‘మదురై తనిష్క్‌’ దోపిడీలో ప్రధాన నిందితుడు అరెస్టు

చెన్నై, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): మదురై తనిష్క్‌ జువెలరీషాపులో ఐదు రోజుల క్రితం జరిగిన బంగారు నగల దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు నిషాంత్‌ కృష్ణ (25)ను సోమవారం వేకువజామున ధర్మపురి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ దోపిడీకేసులో ఇప్పటికే నిషాంత్‌ ప్రేమికురాలు, యూట్యూబర్‌ మీనాక్షిని.., అతని తండ్రి సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారందించిన సమాచారం మేరకు మదురై శివారులోని పంటకాల్వ వద్ద భూమిలో దాచి ఉంచిన 4.5 కిలోలు, ఇతర ప్రాంతాల్లో మరో 5.5 కిలోల నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మొత్తం 15 కిలోల బంగారు ఆభరణాలు చోరీ అయినట్టు పోలీసులు తేల్చారు.

Updated Date - Nov 17 , 2026 | 03:23 AM