మదురైలో భారీ ‘కాక్రోచ్’ ర్యాలీ
ABN , Publish Date - May 25 , 2026 | 03:57 AM
పట్టభద్రులైన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులోని మదురైలో కాక్రోచ్ జనతా పార్టీ...
డీజిల్, పెట్రోల్ ధరల పెంపునకు ఖండన
చెన్నై, మే 24(ఆంధ్రజ్యోతి): పట్టభద్రులైన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులోని మదురైలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తరఫున యువకులు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్, డీజల్ ధరల పెంపునూ ఆందోళనకారులు ఖండించారు. సీజేపీతోపాటు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ), భారత విద్యార్థి సమాఖ్య(ఎస్ఎఫ్ఐ) సంయుక్తంగా ఈ ర్యాలీని నిర్వహించాయి. మదురై గాంధీ మ్యూజియం నుంచి తముక్కమ్ మైదానం వరకు ర్యాలీ కొనసాగింది. కాగా, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ విల్లుపురంలో డీవైఎ్‌ఫఐ సంతకాల సేకరణ ఉద్యమం ప్రారంభించింది.