ఆస్తి విలువ తక్కువగా చూపడం చట్టవిరుద్ధం
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:13 AM
నామినేషన్ పత్రాల్లో ఆస్తి విలువను తక్కువగా చూపడం చట్టవిరుద్ధమని టీవీకే అధ్యక్షుడు విజయ్‌కు హైకోర్టు తలంటింది.
విజయ్‌కు తలంటిన మద్రాసు హైకోర్టు
చెన్నై, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): నామినేషన్ పత్రాల్లో ఆస్తి విలువను తక్కువగా చూపడం చట్టవిరుద్ధమని టీవీకే అధ్యక్షుడు విజయ్‌కు హైకోర్టు తలంటింది. రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న విజయ్.. ప్రమాణ పత్రాల్లో విరుద్ధమైన సమాచారం అందించారని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. అలా ఆస్తి విలువను తక్కువ చేసి చూపడం చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించింది. దీనిపై పూర్తి వివరాలు అందించాలని ఆదేశిస్తూ విజయ్‌తో పాటు ఐటీశాఖకు నోటీసులు జారీ చేసింది.