Share News

Madras High Court: జస్ట్టిస్‌ స్వామినాథన్‌ను విమర్శిస్తూ పుస్తకమా?

ABN , Publish Date - Jan 08 , 2026 | 03:43 AM

తిరుప్పరంకుండ్రంపై కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ తీర్పునిచ్చిన మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌ కీర్తి...

Madras High Court: జస్ట్టిస్‌ స్వామినాథన్‌ను విమర్శిస్తూ పుస్తకమా?

  • దానిని తక్షణం స్వాధీనం చేసుకోండి

  • తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్‌ హైకోర్టు ఆదేశం

చెన్నై, జనవరి 7(ఆంధ్రజ్యోతి): తిరుప్పరంకుండ్రంపై కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ తీర్పునిచ్చిన మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌ కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా పుస్తకం ప్రచురించడంపై మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం చెన్నైలో ప్రారంభం కానున్న పుస్తక ప్రదర్శనలో ఆ పుస్తకాన్ని పెట్టరాదని ఆదేశించింది. అంతేకాకుండా న్యాయమూర్తిపై విమర్శలు గుప్పిస్తూ ప్రచురించిన పుస్తకాన్ని తక్షణం స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ పుస్తక ప్రచురణ సంస్థపై సుమోటోగా కేసు నమోదు చేసి, విచారణకు ఆదేశించింది. వేలూరుకు చెందిన నవీన్‌ ప్రసాద్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌లో జస్టిస్‌ స్వామినాథన్‌పై వ్యక్తిగత దూషణలు, విమర్శలతో ముద్రించిన పుస్తకాన్ని బుక్‌ ఎగ్జిబిషన్‌లో విక్రయిస్తే అది న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకున్నట్లవుతుందని, కాబట్టి ఆ పుస్తకం అమ్మకాలపై నిషేధం విధించాలని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎం శ్రీవాత్సవ, జస్టిస్‌ జి.అరుళ్‌మురుగన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపి ఆదేశాలు ఇచ్చింది.

Updated Date - Jan 08 , 2026 | 03:43 AM